![]() |
![]() |

మన దగ్గర సుష్మిత పేరు వినగానే అందరికీ సుష్మిత కొణిదెల గుర్తుకొస్తారు. కానీ కొన్నాళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్నారు సుష్మిత సేన్. రీసెంట్గా ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చింది. మాసివ్ హార్ట్ ఎటాక్ వల్ల గుండెలో 95 శాతం బ్లాకేజ్ ఉన్నట్టు తెలిసింది. వెంటనే ఆమెకు యాంజియోప్లాస్ట్ చేశారు. వీటన్నిటి గురించి విమెన్స్ డే సందర్భంగా సుష్మిత వివరంగా రాసుకొచ్చారు. ``అమ్మాయిగా పుట్టినందుకు చాలా ఆనందిస్తుంటాను. అది నాకు గొప్ప ఆశీర్వాదంగా అనిపిస్తుంటుంది. నాలో ఉన్న శక్తిని ప్రతిరోజూ కొలుస్తుంటాను. నేను దానికి మా అని పేరు పెట్టుకున్నాను. దుర్గమ్మ అని పేరు పెట్టుకున్నాను. నన్ను నేను గుర్తించుకుని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాను. అలాంటి పవర్‌కి విమెన్స్ డే శుభాకాంక్షలు చెబుతున్నాను`` అంటూ రాసుకొచ్చారు. అంతే కాదు, నేటి జనరేషన్ అమ్మాయిలకు చాలా సలహాలు ఇచ్చారు.
``మీ గురించి ఆలోచించండి. మీ గురించి పట్టించుకోండి. మీకు మీరు ప్రాముఖ్యతనిచ్చుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ ఆనందం చాలా ముఖ్యం. మీరే ఈ ప్రపంచానికి ప్రాణ వాయువు. మిమ్మల్ని అవతలివారు తక్కువ చేస్తే ఊరుకోకండి. చేసేలా చనువు ఇవ్వకండి. ముందు మీకు మీరు ముఖ్యం. మీ ఆనందం ముఖ్యం. ఆ ఆనందంతోనే ఉల్లాసంగా జీవించండి. మిమ్మల్ని మించింది ఇంకేదీ లేదు. మిమ్మల్ని మీరు పట్టించుకోకుంటే ఇంకెవరు పట్టించుకుంటారు? ఎల్లప్పుడూ అవతలివారికి ప్రాముఖ్యతనిచ్చి మిమ్మల్ని వెనక్కి నెట్టుకోకండి`` అంటూ చాలా విషయాలనే చెప్పుకొచ్చారు సుష్మిత సేన్. మార్చి 2న హార్ట్ ఎటాక్ వచ్చిన విషయాన్ని వైద్యులు గోప్యంగా ఉంచారు. తన ప్రైవసీని కాపాడినందుకు వైద్యులకు ధన్యవాదాలు చెప్పారు సుష్మితా సేన్. ముంబైలోని నానావతి హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు సుష్మిత. ఆమె ప్రధాన పాత్రలో ఆర్య3 తెరకెక్కుతోంది. ప్రస్తుతం జైపూర్‌లో షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే సెట్స్ కి వచ్చేస్తానని అన్నారు సుష్మిత. వైద్యుల సలహా కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పారు.
![]() |
![]() |